Tuesday, 20 August 2013

ఎన్టీఆర్ లో భయం ఎందుకు మొదలయిందో ??

ఎన్టీఆర్ లో భయం ఎందుకు మొదలయిందో ??

జూనియర్ ఎన్టీఆర్ లో భయం మొదలైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన తండ్రి చేసిన పనివల్ల ఏర్పడిన చిక్కులతో పాటు, తన సినిమా విడుదల విషయంలోను నిర్మాత దిల్ రాజు తన మాటను ఖాతరు చేయడం లేదని స్పష్టం చేయడం, మరో వైపు తన (నందమూరి )కుటుంబసభ్యులకు మెల్లమెల్లగా దూరమవుతుండడం వంటివి ఆయనను కలవరపెడుతున్నాయి.
అప్పట్లో మహానాడుకు తాను పిలిస్థే వస్థానన్నా కూడా చంద్రబాబుతో సహా తన కుటుంబపెద్దలెవరు స్పందించలేదు, అంతగా పట్టించుకోలేదు, పైగా తారకరత్న తో పరువుతీసే ప్రయత్నం చేసారు. తాజాగా బాలక్రిష్ణ కూతురు పెళ్లికి ఆహ్వానం పంపలేదు, ఇది అంతర్గతంగానే ఉండి పోతుంది అనుకుంటే బయటకు పొక్కి పరువుతీయడం మొదలుపెట్టింది.
ఇది చాలదన్నట్టు తండ్రి హరిక్రిష్ణ సమైక్యం అంటూ సీమాంధ్రవైపు మాట్లాడడంతో మరో ప్రాంతంలో టార్గెట్ అయ్యాడు.
పైగా తాను ఎప్పుడు గ్రేట్ గా చెప్పుకునే తాత ఎన్టీఆర్ ది అదే కోరిక అంటూ చెప్పేసాడు. దీంతో తెలంగాణలో నందమూరి కుటుంబం అంటేనే సీమాంధ్ర పక్షపాతి అన్న ముద్రపడే పరిస్థితి తలెత్తింది. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తులోను తన సినిమాలపై ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తనకు నచ్చని వారి సినిమాల విషయంలో ఎలా వ్యవహరిస్థుందో భవిష్యత్తులో ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వం అలాంటి పనులకు శ్రీకారం చుడితే ఎలా అన్న ఆందోళనను కూడా ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యక్థం చేస్తున్నాడట. మొత్తం మీదు ఈ మద్య ఆయన విషయంలో జరుగుతున్న పరిణామాలన్ని ఆయనను భయానికి లోను చేసాయి అంటున్నారు.

No comments:

Post a Comment