Tuesday, 20 August 2013

ఈ నొప్పిని తట్టుకోలేకపోతుందట.!

ఈ నొప్పిని తట్టుకోలేకపోతుందట.!

సమంతకు మళ్ళీ అనారోగ్యం, ఈ వార్త ఎవరో రాసింది కాదు స్వయాన సమంత తన ట్విటర్ లో తానే పెట్టుకుని తన బాధను తన అభిమానులతో పంచుకుంది.
ఆమె అనారోగ్యం గురించి ఆమె మాటలలోనే చూద్దాం ‘నిన్న మధ్యానం నుంచి మైగ్రేన్ తలనొప్పితో బుర్ర తిరిగి పోతోంది భరించలేక పోతున్నాను ఈ నొప్పి’ అంటూ ట్విట్ పెట్టిన సమంత ఈ నెల 26వ తారీఖు నుండి జూనియర్ ఎన్టీఆర్ తో ‘రామయ్య వస్తావయ్య’ కోసం స్పెయిన్ ఎలా వెళ్ళాలా అని బెంగ పెట్టుకుంటున్నాని బాధ పడుతోంది.
ఈ క్యూట్ బ్యూటీ బాధను పట్టించుకోకుండా ఆమె ప్రియ నేస్తం సిద్దార్డ ఏమిచేస్తున్నాడో మరి. రాజకీయ నాయకులకు ఉద్యమాలతో తల పట్టుకుంటుంటే కానీ మన సమంత ఆ మధ్య ఎండలకు నరకాన్ని, ఈ రోజు విపరీతమైన తల నొప్పితో మరో నరకాన్ని భరిస్తున్న సమంతకు త్వరగా ఆరోగ్యం చేకూరి యంగ్ టైగర్ తో స్పెయిన్ లో చిందులు వేయాలని కోరుకుందాం…

No comments:

Post a Comment